వాట్సాప్ లో వలపు వల.. మోసపోయిన డాక్టర్...

By AN TeluguFirst Published Oct 10, 2020, 12:37 PM IST
Highlights

అమ్మాయిలతో వాట్సప్ చాట్ ఓ వైద్యుడిని నిండా ముంచింది. 41 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ వైద్యుడు లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ తో ట్రాప్ లో పడ్డాడు. వివరాల్లోకి వెడితే...

అమ్మాయిలతో వాట్సప్ చాట్ ఓ వైద్యుడిని నిండా ముంచింది. 41 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ వైద్యుడు లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ తో ట్రాప్ లో పడ్డాడు. వివరాల్లోకి వెడితే...

సైబర్ నేరస్థులు హైదరాబాద్ లోని ఓ వైద్యుడి ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో చాట్ చేశారు. ముగ్గురు యువతులతో వేర్వేరు నెంబర్ల ద్వారా వైద్యుడిని ముగ్గులోకి దించారు. వైద్యుడంటే తమకు చాలా ఇష్టమంటూ రాత్రి పూట ఫోన్లలో మాట్లాడారు. అంతేకాదు వీడియో కాల్ చేసి తాము పడకగదిలో ఉన్నామంటూ స్వీట్ నథింగ్స్ చెప్పారు.

వారి మాయలో పడ్డ వైద్యుడు వారి వలలో పీకల్లోతుగా కూరుకుపోయాడు. ఆ తరువాత తమ దగ్గర అధిక లాభాలాచ్చే పథకాలున్నాయని మెల్లగా అతనికి ఎక్కించారు. అయితే మొదట డబ్బు జమ చేయాలని.. ఆ తరువాత అధిక వడ్డీతోపాటు అసలు వస్తుందని నమ్మ పలికారు. అలా తమతమ ఖాతాలను వైద్యుడికి పంపారు.

మగువ మత్తులో ఉన్న ఆ వైద్యుడు మూడు నెలల్లో రూ. 41 లక్షలు సైబర్ నేరస్తుల ఖాతాల్లో జమ చేశాడు. ఆ తరువాతి నుండి కాల్స్, మెసేజ్ లు ఆగిపోయాయి. రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆ నెంబర్లకు కాల్ చేయగా వారినుండి సమాధానం లేదు. 

దీంతో మోసపోయానని గ్రహించిన వైద్యుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గుజరాత్ లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. 

click me!