ఇంటింటికి మంచినీళ్లు ..24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? : ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు పై కేటీఆర్ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Oct 26, 2023, 10:22 AM IST

BRS working president KTR: ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ప్ర‌భుత్వం ధ‌నం స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంద‌ని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే, రైతు బంధు స‌హా ఆర్థిక సాయం అందించే ప‌లు ప‌థ‌కాల గురించి ప్ర‌స్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో ఎన్నిక‌లు అత్యంత అవినీతిమ‌యంగా మారాయ‌ని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంపై అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తార‌క రామారావు (కేటీఆర్) మండిప‌డ్డారు. కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల దాడి చేశారు. 
 


Telangana Assembly Elections 2023: ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ప్ర‌భుత్వం ధ‌నం స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంద‌ని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే, రైతు బంధు స‌హా ఆర్థిక సాయం అందించే ప‌లు ప‌థ‌కాల గురించి ప్ర‌స్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో ఎన్నిక‌లు అత్యంత అవినీతిమ‌యంగా మారాయ‌ని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంపై అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తార‌క రామారావు (కేటీఆర్) మండిప‌డ్డారు. కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల దాడి చేశారు. 

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసీ ఫిర్యాదు గురించి వెల్ల‌డించిన వివ‌రాల‌ను కేటీఆర్ ప్ర‌స్తావిస్తూ ఎక్స్ పోస్టు లో స్పందిస్తూ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. "ఇంటింటికి మంచినీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని" పేర్కొన్నారు.

Latest Videos

undefined

రైతుల ప‌ట్ల కాంగ్రెస్ న‌డుచుకుంటున్న తీరును మ‌ర్చిపోర‌ని పేర్కొంటూ..క‌ర్నాట‌క రైతులు చేస్తున్న నిర‌స‌న‌ల గురించి ప్ర‌స్తావించారు. "అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి క‌ర్నాట‌క రైతులను అరిగోస పెడుతున్నరని" మండిప‌డ్డారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ మంచి పాల‌న‌ను చూసి కాంగ్రెస్ ఓర్వ‌లేక పోతున్న‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని పేర్కొన్నారు. "తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. జై కిసాన్.. జై తెలంగాణ.. జై కేసీఅర్.. జై బీఆర్ఎస్..!!!" అంటూ త‌న ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

click me!