ఉస్మానియా పాత భవనం సీజ్, డిపార్ట్‌మెంట్లు కొత్త భవనంలోకి: డీఎంఈ రమేష్ రెడ్డి

Published : Jul 22, 2020, 05:07 PM ISTUpdated : Jul 27, 2020, 02:26 PM IST
ఉస్మానియా పాత భవనం సీజ్, డిపార్ట్‌మెంట్లు కొత్త భవనంలోకి: డీఎంఈ రమేష్ రెడ్డి

సారాంశం

ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేయాలని డీఎంఈ  రమేష్ రెడ్డి బుధవారం నాడు ఆదేశించారు.పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీజ్ వేయాలని ఆయన  కోరారు.


హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేయాలని డీఎంఈ  రమేష్ రెడ్డి బుధవారం నాడు ఆదేశించారు.పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీజ్ వేయాలని ఆయన  కోరారు.

మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేస్తున్నారు.ఉస్మానియా పాత భవనంలోని  అన్ని విభాగాలను షిఫ్ట్ చేయాలని ఆదేశించారు డీఎంఈ.  డీఎంఈ ఆదేశాలను వెంటను అమలు చేసేందుకు ఉస్మానియా సూపరింటెండ్ రంగంలోకి దిగారు. 
పాత భవనంలోని పలు విభాగాలను కొత్త భవనంలోకి మారుస్తున్నారు. 

also read:ఉస్మానియాలోకి వర్షపు నీరు: సుమోటోగా తీసుకొన్న హెచ్ఆర్‌సీ

ఈ నెల 14, 15 తేదీల్లో హైద్రాబాద్ లో కురిసిన వర్షంతో ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ వర్షపు నీటితో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పాత భవనంలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో నీరు చేరిన వార్డుల నుండి రోగులను పక్క భవనంలోని వార్డుల్లోకి మార్చారు. ఇప్పటికే ఈ భవనం పెచ్చులూడిపోతోంది. ఎప్పుడు ఈ భవనం కుప్పకూలిపోతోందోననే భయంతో వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

వర్షపు నీరు  పాత భవనంలో చేరడంతో ఈ భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో నీరు చేరడంపై హెచ్ఆర్ సీ సుమోటోగా తీసుకొంది. ఆగష్టు 21 లోపుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?