ప్రభుత్వ పాఠశాలలో జిల్లా జడ్జి కుమార్తెలు

By telugu teamFirst Published Jun 28, 2019, 10:10 AM IST
Highlights

ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చదివించండి అంటూ సలహాలు ఇచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ దానిని ఆచరణలో పెట్టేవాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. 

ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చదివించండి అంటూ సలహాలు ఇచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ దానిని ఆచరణలో పెట్టేవాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. తన ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి... మరికొందరు ఆదిశగా అడుగులు వేసేలా చేశారు ఓ జిల్లా జడ్జి.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ అంగడి జయరాజ్ గారు తమ పిల్లలని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,సిరిసిల్ల లో చేర్పించారు.

10 వ తరగతి చదువుచున్న జనహిత,8 వ తరగతి చదువుచున్న సంఘహిత లని పాఠశాలలో చేర్పించారు.

ఇటీవలే వీరు మంథని నుండి బదిలీపై సిరిసిల్ల వచ్చారు.

ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ 10 రోజులనుండి ప్రభుత్వ పాఠశాలల వివరాలను సేకరించి వాటిలో  బాలికల పాఠశాలని ఎంచుకున్నామని అన్నారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల లో సుశిక్షితులయిన ఉపాధ్యాయులు ఉంటారని,పూర్తి వివరాలు సేకరించాకే నమ్మకంతో పిల్లల్ని చేర్పిస్తున్నామని అన్నారు..

click me!