మహబూబాబాద్ బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ : శంకర్ నాయక్‌కు టికెట్ వద్దు, సహకరించం.. అధిష్టానానికి అల్టీమేటం

Siva Kodati |  
Published : Aug 24, 2023, 04:24 PM IST
మహబూబాబాద్ బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ : శంకర్ నాయక్‌కు టికెట్ వద్దు, సహకరించం.. అధిష్టానానికి అల్టీమేటం

సారాంశం

మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి , సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ మార్చాలని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పోటీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సమావేశంలో తీర్మానించారు . 

బీఆర్ఎస్‌లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ రాజుకుంటోంది. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి , సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ మార్చాలని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. మహబూబాబాద్‌లోని ఒక బీఈడీ కళాశాలలో ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు భేటీ అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పోటీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సమావేశంలో తీర్మానించారు . మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేశారు. 

తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కోసం పనిచేస్తామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని చెబుతున్నారు రవీందర్ రావు వర్గీయులు. తాము శంకర్ నాయక్‌తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు అంటున్నారు. శంకర్ నాయక్‌ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఓడిపోతారని చెబుతున్నారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభ్యర్ధిని మార్చేలా చూస్తానని రవీందర్ రావు తన అనుచరులకు హామీ ఇచ్చారు. అయితే ఇదంతా ఆయన ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు.

ALso Read: సరైన సమయంలో స్పందిస్తా: కులంపై రేఖానాయక్ ఆరోపణలపై జాన్సన్ నాయక్

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ లో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి సిద్దమవుతున్నారు. ఇలా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన, కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!