టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు: బాబుపై టీఆర్ఎస్ నేత ఫిర్యాదు

Published : Mar 08, 2019, 01:20 PM IST
టెర్రరిస్టులంటూ  వ్యాఖ్యలు: బాబుపై టీఆర్ఎస్ నేత ఫిర్యాదు

సారాంశం

తెలంగాణ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్‌ నేత దినేష్ చౌదరి శుక్రవారం నాడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్‌ నేత దినేష్ చౌదరి శుక్రవారం నాడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దినేష్ చౌదరి ఆరోపించారు.  ఈ మేరకు ఎస్ఆర్ నగర్  పోలీసులకు దినేష్ చౌదరి ఫిర్యాదు చేశారు.  తెలంగాణ రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా  బాబు వ్యాఖ్యలు ఉన్నాయని దినేష్ ఆరోపించారు.

2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దినేష్ చౌదరి టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా పని చేశారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవి దినేష్ చౌదరికి దక్కలేదు. ఆయన స్థానంలో ఈడిగ ఆంజనేయులు గౌడ్‌కు ఈ పదవిని బాబు ఇచ్చారు.అయితే  ఆ తర్వాత కొంత కాలానికే దినేష్ చౌదరి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆంజేయులు గౌడ్ కూడ గతంలోనే టీఆర్ఎస్‌లోనే చేరిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.