హరీష్ ఇలాకాలో 61 మంది ఎమ్మెల్యేలు...ఎమ్మెల్సీలు, ఐఎఎస్ లు కూడా

By Arun Kumar PFirst Published Dec 20, 2018, 2:09 PM IST
Highlights

హరీష్ రావు...తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సిద్దిపేట నియోజకర్గం నుండి ఇటీవల లక్షా ఇరవై వేల అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. అయితే నియోజకవర్గ ప్రజలకు ఆయనంటే ఎందుకంత అభిమానమో ఒక్క ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూస్తేనే అర్ధమవుతుంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న హరీష్ అక్కడి
ప్రజలు, ప్రభుత్వం సహకారంతో రూపురేఖలే మార్చేశారు. దీంతో ఈ గ్రామం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. 
 
ఇబ్రహింపూర్ లో జరిగిన అభివృద్ది, పర్యావరణ సంరక్షణ కోసం గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో
ఇవాళ వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఐఎఎస్ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించారు. వీరందరికి మాజీ మంత్రి హరీష్ గ్రామంలో జరిగిన అభివృద్ది గురించి...ఇందులో గ్రామస్తుల భాగస్వామ్యం గురించి వివరించారు. 

మొదట గ్రామ సందర్శనకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో గ్రామస్తులు స్వాగతం పలికారు. విద్యార్థులు పూల మొక్కలు వారికి అందించి గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం డప్పు చప్పులతో గ్రామంలో తిప్పించి అభివృద్ది పనుల గురించి వివరించారు. ఆడపడుచులు బతుకమ్మ, బోనాలతో, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యేలు, అధికారుల బృందానికి హరీష్ రావు వివరించారు. ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల ఐక్యతతో ఇబ్రహీంపూర్ లో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని హరీష్ తెలిపారు.

ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధుల వివరాలు

click me!