ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈ డీ కార్యాలయానికి బిల్డర్ శ్రీనివాసరావు తరలింపు

By narsimha lode  |  First Published Sep 19, 2022, 4:30 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు తెలంగాణలోని ఆరు చోట్ల ఏక కాలంలో సోదాలు చేశారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో బిల్డర్ శ్రీనివాసరావు నివాసంలో సోదాలు ముగిసిన తర్వాత ఆయనను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.


హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు  బిల్డర్  శ్రీనివాసరావును తమ కార్యాలయానికి తీసుకువెళ్లారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న నివాసం నుండి శ్రీనివాసరావును తమ వాహనంలోనే ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకువెఁళ్లారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం హైద్రాబాద్ , కరీంనగర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైద్రాబాద్ లోని మూడు ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్ కు చెందిన బిల్డర్ శ్రీనివాస్ కు చెందిన నివాసాల్లో కూడ  సోదాలు చేశారు ఈడీ అధికారులు. మరో వైపు  రెండు రియల్ ఏస్టేట్ కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు గంటల పాటు హైద్రాబాద్ లోని  శ్రీనివాసరావు ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను తమ కార్యాలయానికి తీసుకు వచ్చారు.హైద్రాబాద్ లో ఆరు చోట్ల ఏక కాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Latest Videos

undefined

రాబిన్ డిస్టిలరీస్ కు సంబంధించి గండ్ర ప్రేమ్ సాగర్ రావుకు  సమీప బంధువే శ్రీనివాసరావు. ఈ కేసుకు సంబంధించే  శ్రీనివాసరావును  ఈడీ కార్యాలయానికి తరలించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈ నెల 16వ తేదీన  దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణలోని పదికిపైగా చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల సమయంలోనే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 12 మందితో పాటు 18 కంపెనీలకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

also read:హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఐటీ కంపెనీలు, బిల్డర్ల ఇళ్లలో కొనసాగుతున్న తనిఖీలు!

ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై పేరును కూడా సీబీఐ అధికారులు చేర్చారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

click me!