హైద్రాబాద్‌‌కి వరదలు: ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల సహాయం

Published : Oct 20, 2020, 12:17 PM IST
హైద్రాబాద్‌‌కి వరదలు:  ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల సహాయం

సారాంశం

భారీ వర్షాలతో హైద్రాబాద్ నగరం అతలాకుతలమైంది. నగరంలో భారీ వరదల కారణంగా హైద్రాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


హైదరాబాద్: భారీ వర్షాలతో హైద్రాబాద్ నగరం అతలాకుతలమైంది. నగరంలో భారీ వరదల కారణంగా హైద్రాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నగరంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లను విడుదల చేసింది.ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా సీఎం కేజ్రీవాల్ ఈ విషయాన్ని తెలిపారు.

 

వరదలతో హైద్రాబాద్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైద్రాబాద్ లోని సోదర, సోదరీమణుల పక్షాన ఢిల్లీ ప్రజలు నిలబడుతున్నారని ఆయన ప్రకటించారు. సహయ పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లను విడుదల చేయనుందని ఆయన తెలిపారు.

 తమిళనాడు సీఎంకు కేసీఆర్ ధన్యవాదాలు

హైద్రాబాద్ లో వరదల కారణంగా సహాయ పునరావాస చర్యల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం నాడు రూ. 10 కోట్లు ప్రకటించారు.ఈ మేరకు తెలంగాణ సీఎం కు పళని  లేఖ రాశారు. 

మంగళవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ పళనిస్వామికి పోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. హైద్రాబాద్ వరదలతో ఇబ్బందిపడుతున్న ప్రజలను ఆదుకొనేందుకు గాను తెలంగాణకు  ఆర్ధిక సహాయం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!