కృష్ణంరాజు ఇంటికి కేంద్ర మంత్రుల క్యూ.. రేపు హైదరాబాద్‌కి రాజ్‌నాథ్ సింగ్

Siva Kodati |  
Published : Sep 15, 2022, 04:59 PM IST
కృష్ణంరాజు ఇంటికి కేంద్ర మంత్రుల క్యూ.. రేపు హైదరాబాద్‌కి రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

ఇటీవల అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు నివాసానికి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు.  దీనిలో భాగంగా రేపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. 

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు రక్షణ మంత్రి. 2.40 గంటలకు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి రాజ్‌నాథ్ సింగ్ చేరుకుని.. రెబల్‌స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో జరిగే కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొననున్నారు రాజ్‌నాథ్ సింగ్. సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. 

ఇకపోతే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రభాస్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్‌ కి వస్తోన్న అమిత్‌ షా మొదటగా ప్రభాస్‌ ని కలవబోతున్నారట. కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించి, ఆయన మృతి పట్ల తన సానుభూతిని తెలియజేయనున్నారని తెలుస్తుంది. కృష్ణంరాజు చివరి వరకు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ప్రభాస్‌ ఫ్యామిలీని కలిసి తన సంతాపాన్ని తెలియజేయబోతుండటం విశేషం. 

ALso REad:ప్రభాస్‌తో భేటీ కానున్న హోంమంత్రి అమిత్‌ షా .. కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ

ఇదిలా ఉంటే అమిత్‌ షా ఇటీవల వరుసగా సినిమా సెలబ్రిటీలను కలుస్తున్నారు. మొదట ఆయన ఎన్టీఆర్‌ని కలిసి రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ నాయకులు నడ్డా యంగ్‌ హీరో నితిన్‌ని మీట్‌ అయ్యారు. ఇప్పుడు అమిత్‌ షా ప్రభాస్‌ ని కలవబోతుండటం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారింది. దీంతోపాటు నిఖిల్‌ని కూడా అమిత్‌ షా కలబోతున్నట్టు తెలుస్తుంది. 

ప్రభాస్‌ `బాహుబలి` చిత్రంతో జాతీయ స్థాయిలో నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న విసయం తెలిసిందే. ఆయన వరుసగా పాన్‌ ఇండియాసినిమాలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపుతెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం `ఆదిపురుష్‌`లో రాముడిగా నటిస్తున్నారు ప్రభాస్‌. ఈచిత్ర ఫస్ట్ లుక్‌ని ఈ నెల 26న, టీజర్‌ని అక్టోబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో రామ్‌ లీలా మైదానంలోనిర్వహించే దసరా వేడుకలకు ప్రభాస్‌ని గెస్ట్ గా ఆహ్వానించడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్