పనికి వెళ్లి నాలుగు రోజుల తర్వాత శవంగా.....

Published : Apr 07, 2019, 03:17 PM IST
పనికి వెళ్లి నాలుగు రోజుల తర్వాత శవంగా.....

సారాంశం

కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం శనివారం నాడు నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దొరికింది.  ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. ఇదే అపార్ట్‌మెంట్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిదే ఈ మృతదేహమని స్థానికులు గుర్తించారు. 

హైదరాబాద్: కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం శనివారం నాడు నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దొరికింది.  ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.
ఇదే అపార్ట్‌మెంట్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిదే ఈ మృతదేహమని స్థానికులు గుర్తించారు. ఏప్రిల్ రెండో తేది నుండి అతను కన్పించకుండాపోయాడు.

ఈ పెయింటర్  ఏప్రిల్ రెండో తేదీన లిఫ్ట్ షాఫ్ట్‌లో పడిపోయాడు. అయితే అతడిని ఎవరూ గుర్తించలేదు. కానీ, శనివారం నాడు ఓ కార్మికుడు లిఫ్ట్ షాఫ్ట్‌ నుండి దుర్వాసన వస్తున్న విషయాన్ని  గుర్తించి  ఇతరులకు చెప్పడంతో పెయింటర్ చనిపోయిన విషయం వెలుగు చూసింది.

యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ అలీమ్‌ను  పెయింటింగ్ కాంట్రాక్టర్‌ అతడిని ఈ భవనంలో పనికి తీసుకొచ్చాడు.  చందానగర్‌లోని గిరిజా మార్వెల్ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయాడు. 

ఈ విషయాన్ని ఎవరూ కూడ గుర్తించలేదు ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్ ఉన్నాయి.  నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ షాప్ట్‌లో అలీమ్ పడిపోయి మృతి చెందాడు. పెయింటింగ్ పనికి వెళ్లిన అలీమ్ తిరిగి రాలేదు. అయితే అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అలీమ్ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ విషయం వెలుగు చూసింది. మృతదేహాన్ని  పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu