నడిరోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Siva Kodati |  
Published : Apr 07, 2019, 10:50 AM IST
నడిరోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

సారాంశం

ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్బిణీ ఆస్పత్రికి వెళ్లేలోపే నడిరోడ్డుపై ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన మేరియమ్మ అనే మహిళ శనివారం నొప్పులతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడి వైద్యులు పరీక్షించి అంతా బాగానే ఉంది... కానీ గాంధీ ఆసుపత్రికి వెళితే మంచిది అని చెప్పింది. దీంతో మేరియమ్మ మరో మహిళతో కలిసి వనస్థలిపురం నుంచి ఎల్‌బీ నగర్ వెళ్లే బస్సు ఎక్కింది.

అయితే ఆ కాసేపటికే నొప్పులు ఎక్కువ కావడంతో రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu