కొంపముంచిన గూగుల్ మ్యాప్: గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లిన డీసీఎం

By narsimha lode  |  First Published Dec 10, 2023, 5:38 PM IST

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని  డీసీఎంను నడిపిన ఓ వ్యక్తి  గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లాడు. అయితే  చివరి నిమిషంలో ప్రమాదాన్ని గుర్తించి డీసీఎంను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. 



హైదరాబాద్: గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని  ఓ డ్రైవర్ డీసీఎంను ఉమ్మడి మెదక్ జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రాజెక్టులోకి వెళ్లిన డీసీఎంను  స్థానికులు ఆదివారం నాడు వెలికి తీశారు. 

శనివారంనాడు హన్మకొండ నుండి  హైద్రాబాద్ కు  జేసీబీతో  డీసీఎం వెళ్తుంది.  రామవరం మీదుగా  హైద్రాబాద్ కు డ్రైవర్ వెళ్తున్నాడు. అయితే ఈ మార్గం డ్రైవర్ కు తెలియదు. దీంతో గూగుల్ మ్యాప్  సహాయం తీసుకున్నాడు.సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని  అక్కన్నపేట మండలం నందారం స్టేజీ వద్ద డీసీఎం వ్యాన్ కుడివైపునకు వెళ్లాల్సి ఉంది.  కానీ, గూగుల్ మ్యాప్  డ్రైవర్ కు ఎడమ వైపునకు వెళ్లాలని సూచించింది. గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలోనే డ్రైవర్ డీసీఎంను ముందుకు నడిపించాడు.

Latest Videos

undefined

అయితే  డీసీఎం నీళ్లలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్  తిరిగి అక్కడే వాహనాన్ని నిలిపివేశాడు. అలానే ముందుకు వెళ్తే ప్రమాదం జరిగేది. ఇవాళ ఉదయం గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల సహయంతో  ఇవాళ డీసీఎంను బయటకు తీశారు.

also read:కొంపముంచిన గూగుల్ మ్యూప్: గౌరవెల్లి ప్రాజెక్టులో మునిగిన లారీ

ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కూడ ఇదే తరహలో ఓ లారీ డ్రైవర్  గౌరవెల్లి ప్రాజెక్టులోకి లారీని తీసుకెళ్లాడు.ఈ మార్గంలో  ఆయన  ప్రయాణించడం కొత్త. దీంతో గూగుల్ మ్యాప్ ను ఆశ్రయించాడు.  గూగుల్ మ్యాప్  గౌరవెల్లి ప్రాజెక్టులోపలికి మార్గాన్ని చూపింది.  ప్రాజెక్టు నీటిలోకి లారీని తీసుకెళ్లాడు డ్రైవర్. చివరి నిమిషంలో  గుర్తించి డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు దక్కించుకున్నారు.


 

click me!