జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి.. దత్తాత్రేయ

Published : May 06, 2019, 02:29 PM IST
జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి.. దత్తాత్రేయ

సారాంశం

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 26మంది ఇంటర్ విద్యార్థులు మృతి చెందారని... దీనికి బాధ్యత విద్యాశాఖ మంత్రి తీసుకోరా అని ఆయన ప్రశ్నించారు.   

సోమవారం అస్తవ్యస్తం అవుతున్నవ్యవస్థలు అనే అంశంపై నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రే ఉద్యమాలు అణిచివేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో 19రోజుల నుంచి మారణకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటి వరకూ 26మంది విద్యార్థులు చనిపోయారని చెప్పుకొచ్చారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందని దత్తన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మేం రాష్ట్రపతిని కలుస్తామన్నారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

లాల్ బహదూర్ శాస్త్రి తాను నిర్వహిస్తున్న రైల్వే శాఖలో ఒక యాక్సిడెంట్ అయ్యిందని ఆయన తనంతట తానే రాజీనామా చేశారని ఈ సందర్బంగా దత్త్రాత్రేయ గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం 26మంద స్టూడెంట్స్ చనిపోయిన ఆశాఖ మంత్రి రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం