సీఐ నిర్వాకం: పోలీస్‌స్టేషన్‌లోనే కాంట్రాక్టర్ బర్త్‌డే వేడుకలు

Published : May 06, 2019, 12:24 PM IST
సీఐ నిర్వాకం:  పోలీస్‌స్టేషన్‌లోనే కాంట్రాక్టర్ బర్త్‌డే వేడుకలు

సారాంశం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌లో రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పుట్టిన రోజు వేడుకలను సీఐ ఇంద్రసేనారెడ్డి తన ఛాంబర్లో నిర్వహించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌లో రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పుట్టిన రోజు వేడుకలను సీఐ ఇంద్రసేనారెడ్డి తన ఛాంబర్లో నిర్వహించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ బర్త్‌డే  వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో‌ వైరల్‌గా మారింది.

జిల్లాలోని వీణవంక మండలం  గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఈ నెల 4వ తేదీన జరిగాయి.  మానకొండూరు  సీఐ ఇంద్రసేనారెడ్డి కేక్ కట్ చేసి మరీ రవీంరద్ రెడ్డితో పాటు పలువురికి కేక్ తినిపించాడు.

రవీందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తన టేబుల్‌పైనే సీఐ కేక్ కట్ చేయడం గమనార్హం.   కాంట్రాక్టర్ నల్లా రవీందర్ రెడ్డికి సీఐకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే  బర్త్ డే వేడుకలు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

వ్యవసాయంపై ఎల్ నినో ఎఫెక్ట్..75 ఏళ్ల హిస్టరీలోనే బిగ్గెస్ట్ డేంజర్ | AP & Telangana Rain Alert
రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Entry at Rythu Ashirvada Sabha