ఇందు అనుమానాస్పద మృతి కేసు... బాలిక ఊపిరితిత్తుల్లో నీటి ఆనవాళ్లు, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు

By Siva Kodati  |  First Published Dec 16, 2022, 4:06 PM IST

దమ్మాయిగూడ చెరువులో అనుమానాస్పద స్థితిలో మరణించిన చిన్నారి ఇందూ పోస్ట్‌మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లుగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు.


దమ్మాయిగూడ చెరువులో అనుమానాస్పద స్థితిలో మరణించిన చిన్నారి ఇందూ పోస్ట్‌మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. బాలిక ఊపిరితిత్తుల్లో వైద్యులు నీటి ఆనవాళ్లను గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చారు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లుగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. అయితే చెరువులో ఆమెను తోసేశారా..? లేక ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. చిన్నారి మృతదేహంతో బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతిపై క్లారిటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తమకు ఇవ్వాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

ALso Read:విషాదంగా ముగిసిన ఇందు మిస్సింగ్: హైద్రాబాద్ దమ్మాయిగూడ చెరువులో విద్యార్ధిని డెడ్‌బాడీ లభ్యం

Latest Videos

కాగా... నిన్న అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్ధిని ఇందు మృతి చెందింది.  దమ్మాయిగూడ చెరువులో బాలిక  మృతదేహాన్ని శుక్రవారం నాడు  గుర్తించారు. ఇందు మృతదేహన్ని చూసిన పేరేంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ వద్ద 10 ఏళ్ల  విద్యార్ధిని  ఇందును తండ్రి  వదిలివెళ్లాడు. అయితే  స్కూల్ ప్రారంభం కాకముందే విద్యార్ధిని బయటకు వెళ్లింది.  అయితే స్కూల్ లో  హాజరు తీసుకొనే సమయంలో ఇందుకు చెందిన  బ్యాగు, పుస్తకాలను  గుర్తించిన టీచర్  ఆమె తండ్రికి పోన్ చేశాడు. స్కూల్ కు వచ్చిన  తండ్రి, కుటుంబ సభ్యులు, స్కూల్ టీచర్లు  బాలిక కోసం వెతికారు.  అయినా కూడా ఆమె ఆచూకీ లభ్యం  కాలేదు. ఇవాళ  ఉదయం కూడా  ఇందు ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ  ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో దమ్మాయిపేట చెరువు వద్ద  బాలిక డెడ్ బాడీని వెలికితీశారు పోలీసులు.  నిన్న పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించిన సమయంలో  విద్యార్ధిని  చెరువు కట్ట వైపునకు  వెళ్లిన దృశ్యాలను గుర్తించారు.

click me!