కాంగ్రెస్‌ గూటికి డీఎస్: నేడు ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్, మల్లు

Published : Dec 17, 2021, 10:19 AM ISTUpdated : Dec 17, 2021, 10:25 AM IST
కాంగ్రెస్‌ గూటికి డీఎస్: నేడు ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్, మల్లు

సారాంశం

మాజీ మంత్రి, డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఎఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు చర్చించనున్నారు. డీఎస్ గురువారం నాడు సోనియాగాంధీతో భేటీ అయ్యారు.  

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో కూడా డీఎస్ గురువారం నాడు భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఇవాళ ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. డీఎస్  కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై చర్చించనున్నారు.ఎఐసీసీ చీఫ్ Sonia gandhiతో డీఎస్ గురువారం నాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై చర్చించారు. చాలా కాలంగా డీఎస్  టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు Kcr కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నించారు. అయితే కేసీఆర్ మాత్రం డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అంతేకాదు పార్టీ కార్యక్రమాల సమాచారం కూడ డీఎస్ కు అందడం లేదు. 

also read:కేసీఆర్‌కు షాకివ్వనున్న డీఎస్ .. త్వరలో కాంగ్రెస్‌ గూటికి, మంతనాలు జరుపుతోన్న హైకమాండ్

అయితే పార్టీతో దూరం పెరిగిన సమయంలో  గతంలో ఒక్కసారి మాత్రమే పార్టీ ఎంపీల సమావేశానికి డీఎస్ హాజరయ్యారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా గత ఏడాదిలో డీఎస్ భేటీ అయ్యారు. డీఎస్ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. డీఎస్ తనయుడు అర్వింద్ 2019 లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. అర్వింద్ విజయం సాధించడం వెనుక డీఎస్ చక్రం తిప్పారనే ప్రచారం కూడ అప్పట్లో నెలకొంది.

Trs లో చేరిన కొద్దికాలానికే టీఆర్ఎస్ చీఫ్ Kcr డీఎస్ ను Rajya sabha పంపారు. వచ్చే ఏడాది జూన్ వరకు D Srinivvas పదవీకాలం ఉంది. అయితే డీఎస్ పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో అదే జిల్లా నుండి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టింది టీఆర్ఎస్.చాలా కాలంగా డీ.శ్రీనివాస్ Congress  పార్టీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీఎస్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలిశారనే ప్రచారం సాగింది. డీఎస్ కు సన్నిహితులుగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.  అయితే డీఎస్ కాంగ్రెస్ లో చేరడం అప్పట్లో వాయిదా పడింది.డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై టీపీసీసీ చీఫ్ Revanth Reddy,  సీఎల్పీ నేత Mallu Bhatti vikramarka చర్చించే ఎఐసీసీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. 

.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ