కూకట్‌పల్లి కాల్పుల కేసు: నిందితుల అరెస్ట్... సరిహద్దులు దాటకుండానే పట్టేసిన పోలీసులు

Siva Kodati |  
Published : Apr 29, 2021, 10:08 PM IST
కూకట్‌పల్లి కాల్పుల కేసు: నిందితుల అరెస్ట్... సరిహద్దులు దాటకుండానే పట్టేసిన పోలీసులు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కాల్పుల కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో వీరిని అరెస్ట్ చేశారు ఎస్‌వోటీ పోలీసులు. నాందేడ్ పారిపోతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. 

అంతకుముందు కూకట్‌పల్లి కాల్పుల ఘటనపై స్పందించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దుండగులు రూ.5 లక్షలతో పరారయ్యారని ఆయన తెలిపారు. ఇది పాత నేరస్తుల పనేనన్న సజ్జనార్.. ఇద్దరు దుండగులు 25-30 మధ్య వయసులోపువారేనని చెప్పారు. 

కాగా, గురువారం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. యంత్రంలో డబ్బులు నింపుతుండగా అదే సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

Also Read:కూకట్‌పల్లిలో ఏటీఎంపై కాల్పులు... పాతనేరస్థుల పనే: సీపీ సజ్జనార్

ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్‌ మరణించగా, శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు బుల్లెట్లు, బుల్లెట్‌ లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?