చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన పోలీసులు

Published : Jan 21, 2019, 10:38 AM IST
చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన పోలీసులు

సారాంశం

నగరంలో వరస దొంగతనాలకు పాల్పడి.. గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

నగరంలో వరస దొంగతనాలకు పాల్పడి.. గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.  నగర శివారు ప్రాంతాలు, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని నెలలుగా చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోంది. అటెన్షన్ డైవర్షన్ తో ఇరానీ గ్యాంగ్ బీభత్సం సృష్టించి దోపిడీలకు పాల్పడింది.

చోరీ చేసే క్రమంలో అడ్డు వచ్చిన వారిపై దాడి చేయడానికి కూడా  ఈ చెడ్డీ గ్యాంగ్ లు వెనకాడలేదు.  సంక్రాంతి పండగ సమయంలో కూడా ఈ రెండు గ్యాంగ్ లు చాలా ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాయి. కాగా.. ఎట్టకేలకు రెండు ముఠాలను పోలీసులు పట్టుకోగలిగారు. ఈ ముఠాల వద్ద నుంచి సొమ్మను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్