శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబైకి బంగారం స్మగ్లింగ్

By narsimha lodeFirst Published Oct 4, 2020, 2:23 PM IST
Highlights

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబైకి అక్రమంగా గోల్డ్ ను తరలిస్తున్న సమయంలో  కస్టమ్స్  అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.


హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబైకి అక్రమంగా గోల్డ్ ను తరలిస్తున్న సమయంలో  కస్టమ్స్  అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

బంగారానికి వెండి పూత వేసి ఎయిర్ పోర్ట్ కార్గిల్ పార్శిల్ ద్వారా  ముంబైకి తరలిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తే ఈ విషయం వెలుగు చూసింది.

సుమారు 30 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 21 కిలోల బంగారం ఆభరణాలు డైమండ్స్  ను స్వాధీనం చేసుకొన్నారు.ఐదు గంటల పాటు విమానం ఎయిర్ పోర్టు కార్గిల్ పార్శిల్ లో కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.

ముంబైకి చెందిన శ్రీపాల్ జైన్ అనే వ్యక్తికి పంపేందుకు సిద్దంగా ఉన్న పార్శిల్ ను అధికారులు సీజ్ చేశారు. హైద్రాబాద్ కు చెందిన ఆశోక్ అనే వ్యక్తి ఈ పార్శిల్ ను పంపుతున్నట్టుగా గుర్తించారు.

ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకుల నుండి గతంలో ఈ విమానాశ్రయం నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్న ఘటనలు కూడ అనేకం చోటు చేసుకొన్నాయి.

click me!