తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం .. తొలిరోజు ఎంతమందికంటే..?

Siva Kodati |  
Published : Aug 03, 2023, 05:16 PM IST
తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం .. తొలిరోజు ఎంతమందికంటే..?

సారాంశం

తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు గురువారం రూ.167.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు 44,870 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 

తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు గురువారం రూ.167.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య వున్న రుణాలు మాఫీ చేసింది. ఈరోజు 44,870 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 

కాగా.. రైతు రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీపై ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. అనంతరం రేపటి నుంచి రైతు రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. నోట్ల రద్దు, కరోనా కారణంగా వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపుపై కేంద్రం అనుసరించిన కక్షపూరిత చర్యల వల్లే రైతు రుణమాఫీ చేయడానికి సమయం పట్టిందని కేసీఆర్ అన్నారు. 

Also Read: అన్నదాతలకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ, అధికారులకు కీలక ఆదేశాలు

అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడే వుంటామని సీఎం పేర్కొన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలను నిబద్ధతతో కొనసాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులకు మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీ జరగాల్సి వుందని.. రైతు బంధు తరహాలో విడతలవారీగా చేస్తూ, సెప్టెంబర్ రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా