హైదరాబాద్‌లో పాతనేరస్థుడి దారుణ హత్య.. గొంతుకోసిన దుండగులు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 26, 2020, 01:15 PM ISTUpdated : Dec 26, 2020, 01:42 PM IST
హైదరాబాద్‌లో పాతనేరస్థుడి దారుణ హత్య.. గొంతుకోసిన దుండగులు..

సారాంశం

హైదరాబాద్ లో పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న ఓ పాత నేరస్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.  చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధి కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో శనివారం తెల్లవారు జామున పాత నేరస్థుడు రాజును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం చంపేశారు. 

హైదరాబాద్ లో పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న ఓ పాత నేరస్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.  చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధి కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో శనివారం తెల్లవారు జామున పాత నేరస్థుడు రాజును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం చంపేశారు. 

మల్లాపూర్‌కు చెందిన రాజు గతనెలలో పండ్ల దొంగతనం కేసులో చైతన్య పురి పోలీసు స్టేషన్‌లో అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున రాజును గుర్తుతెలియని దుండగులు  గొంతుకోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

రాజు ఫ్రూట్ మార్కెట్‌లలో తరచూ పండ్లను దొంగిలించేవాడని, అదే క్రమంలో బాగా మద్యం సేవించి, నిన్న రాత్రి కుడా ఫ్రూట్ మార్కెట్‌లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్‌తో గొడవపడి...తననే అరెస్టు చేపిస్తావా, అంతు చూస్తానని రాజు బెదిరించినట్లు సమాచారం. 

రాజు బెదిరింపులకు దిగడంతో గత రాత్రి మహ్మద్ ఫిరోజ్ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా.. రాజు బెదిరింపులకు కోపోద్రక్తుడైన ఫిరోజు తెల్లవారుజామున రాజు గొంతు కోసం హత్య చేశాడు. 

అయితే అక్కడ నమోదైన సీసీ కెమెరాలలో మాత్రం మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజును హత్య చేసిన మహ్మద్ ఫిరోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

రాజు మృతదేహన్ని చూసిన మార్కెట్‌లోని వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు