పెళ్లి వద్దన్న వధువు.. ప్రేమికుడితో..

Published : Dec 26, 2020, 01:11 PM IST
పెళ్లి వద్దన్న వధువు.. ప్రేమికుడితో..

సారాంశం

కుటుంబసభ్యులు బలవంతంగా చేస్తున్న పెళ్లిని ఆపేసి.. ప్రియుడిని చేరుకుంది. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. 

మండపంలో మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. వధువు పోలీసులకు పిలిచి ఆపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుడు.. పెళ్లికి వచ్చిన మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అయితే.. పెళ్లి ఆపిన తర్వాత వధువు తన ప్రియుడి వద్దకు వెళ్లింది.

కుటుంబసభ్యులు బలవంతంగా చేస్తున్న పెళ్లిని ఆపేసి.. ప్రియుడిని చేరుకుంది. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. దీంతో శుక్రవారం మహబూబాబాద్‌ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్