2018 తెలంగాణ క్రైమ్ రిపోర్ట్ ఇదే

By sivanagaprasad KodatiFirst Published Dec 30, 2018, 12:33 PM IST
Highlights

2018వ సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో నేరాల నివేదికను విడుదల చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు

2018వ సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో నేరాల నివేదికను విడుదల చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని,  ఆధునిక సాంకేతికతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. నేర రహిత తెలంగాణే తమ లక్ష్యమని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నేరాల అదుపులో ప్రజల సహకారం మరవలేనిదన్నారు.  ఈ ఏడాది రాష్ట్రంలో 5శాతం నేరాలు తగ్గాయని డీజీపీ ప్రకటించారు. 
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేరాల వివరాలు:

* తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం తగ్గిన హత్యలు.

* 8శాతం తగ్గిన ఆస్తి తగాదాలు.

* 43 శాతం తగ్గిన గొలుసు దొంగతనాలు.

* మహిళల పై 7శాతం తగ్గిన నేరాలు.

* సైబర్ క్రైమ్ తగ్గిన 3శాతం.

* మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం తగ్గిన నేరాల శాతం.

* నిందితులకు యావజ్జివ శిక్షలు పడటంలో 11 శాతం పెరిగాయి.

* ప్రాపర్టీ కేసుల శాతం రాష్ట్రంలో 8 శాతం తగ్గాయి.

* చైన్ స్నాచింగ్ 43 శాతం తగ్గాయి.

* రాబరిస్ 29 శాతం తగ్గాయి.

* బ్యాంక్ లలో దొంగతనాల శాతం 10 శాతం తగ్గాయి.

* ఏటీఎంలలో చోరీలు 51 శాతం తగ్గాయి.

* తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపులు 19శాతం తగ్గాయి.

* రాష్ట్ర వ్యాప్తంగా రేప్ కేసులు 11 శాతం తగ్గాయి.

* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కేసులు కలిపి 102307 నమోదు అయ్యాయి.

* క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ 7 శాతం తగ్గాయి.

* క్రైమ్ ఎగైనెస్ట్ ఎస్సి, ఎస్టీ 3 శాతం పెరిగాయి.

* ప్రాపర్టీ రికవరీ లో 69 శాతం సక్సెస్

* రాష్ట్ర వ్యాప్తంగా 20, 325 రోడ్ ప్రమాదాలు

* ఎన్నికల్లో ఎక్కడా రీ-పోలింగ్ జరగలేదు.

* రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలు జరగటం దురదృష్టకరం..కచ్చితంగా వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు.
 

click me!