తెలంగాణలోనూ సిపిఎంతో పవన్ కల్యాణ్ పొత్తు

By pratap reddyFirst Published 26, Aug 2018, 8:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడానికి దాదాపుగా సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ సిపిఎంతో పొత్తుకు సిద్ధపడుతున్నారు.  సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ విషయం చెప్పారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడానికి దాదాపుగా సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ సిపిఎంతో పొత్తుకు సిద్ధపడుతున్నారు.  సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ విషయం చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎన్నికల్లో పొత్తుపై వారం రోజుల్లో పవన్‌తో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. 

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మినహా ఏ పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ తరపున అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమిటో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

Last Updated 9, Sep 2018, 12:09 PM IST