మునుగోడు బైపోల్ 2022: టీఆర్ఎస్‌కు మద్దుతుపై సీపీఐలో రచ్చ..!

Published : Aug 20, 2022, 12:28 PM ISTUpdated : Aug 20, 2022, 12:44 PM IST
మునుగోడు బైపోల్ 2022: టీఆర్ఎస్‌కు మద్దుతుపై సీపీఐలో రచ్చ..!

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతివ్వడం ఖాయంగా  కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతుపై సీపీఐలో కొంద రచ్చ చోటుచేసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతివ్వడం ఖాయంగా  కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతుపై సీపీఐలో కొంద రచ్చ చోటుచేసుకుంది. ఈ అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సమావేశం కాకముందే కొందరు నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లడంపై సమావేశంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని కొందరు కార్యవర్గ సభ్యులు తప్పుబడుతున్నట్టుగా సమాచారం. అధికార పార్టీకి మద్దతిస్తే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు మద్దతిచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇక, మునుగోడులో సీపీఐ, టీఆర్ఎస్ పొత్తుతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నేడు మునుగోడులో జరిగే టీఆర్ఎస్ సభలో సీపీఐ నేతలు కూడా పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా మునుగోడుకు వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!