పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

Published : Jun 14, 2019, 04:17 PM IST
పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

సారాంశం

టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందిన ఆరోపిస్తూ శుక్రవారం నాడు సీపీఐ కార్యకర్తలు, నేతలు హైద్రాబాద్‌లో అర్దనగ్న ప్రదర్శన నిర్వహించారు.   

హైదరాబాద్:  టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందిన ఆరోపిస్తూ శుక్రవారం నాడు సీపీఐ కార్యకర్తలు, నేతలు హైద్రాబాద్‌లో అర్దనగ్న ప్రదర్శన నిర్వహించారు. 

నమ్మకంతో గెలిపించిన ప్రజలను అమ్మి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో మమత బెనర్జీ సర్కార్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని  ఆయన  అభిప్రాయపడ్డారు.  ఫిరాయింపులను తాను ప్రోత్సహించననని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

ఒకవేళ తమ పార్టీలోకి ఎవరైనా వస్తే  పదవులకు రాజీనామా చేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్‌ చేసిన  ప్రకటనను నారాయణ అభినందించారు. జగన్ ను చూసి ేసీఆర్ విలువలను నేర్చుకోవాలని నారాయణ సూచించారు. ఏపీలో చంద్రబాబుకు పట్టిన గతే  తెలంగాణలో కేసీఆర్‌కు పడుతోందన్నారు. ఎంఐఎం ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగిదేమీ లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.

ఫిరాయింపులను నిరసిస్తూ హైద్రాబాద్‌లోని ఎఐటీయూసీ కార్యాయలం నుండి ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నేతలను  పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే