పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవకు కోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Siva Kodati |  
Published : Jan 28, 2022, 02:52 PM IST
పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవకు కోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

సారాంశం

పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది

పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కొత్తగూడెం కోర్టు స్పష్టం చేసింది. కాగా. వనమా రాఘవకు ఇటీవలే మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించింది న్యాయస్థానం. ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. రాఘవ రిమాండ్‌ గడువు ముగియడంతో జనవరి 22న పోలీసులు అతడిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. 

మరోవైపు రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే vanama venkateshwara rao తనయుడు  vanama raghavendra rao కు  పోలీస్ శాఖలో ఎవరు సహకరించారనే విషయమై  ఆ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది.  వనమా రాఘవేందర్ కు police శాఖ నుండి కూడా సహకారం ఉందనే విమర్శలు కూడా లేకపోలేదు.

ఉమ్మడి Khammam జిల్లాలోని పాల్వంచలో Ramakrishna కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడింది., రామకృష్ణ ఆయన భార్య  శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ నెల 7 రాత్రి వనమా రాఘవేందర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు Arrest చేశారు. అయితే వనమా రాఘవేందర్ అరెస్ట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారుల వ్యూహాలను నిందితుడికి సమాచారం చేరవేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే ఈ సమాచారాన్ని రాఘవేందర్ కు ఎవరు చేరవేశారనే విషయమై అంతర్గతంగా పోలీస్ శాఖ చేపట్టింది.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత పాల్వంచ నుండి అదృశ్యమైన రాఘవేందర్  Hyderabad విశాఖ తదితర ప్రాంతాల్లో గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో  రాఘవేందర్ సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే రాఘవ ఉపయోగించిన Sim కార్డులకు పోలీస్ శాఖ నుండి ఎవరెవరు సమాచారం ఇచ్చారనే విషయమై ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై Ipc 302, 307,306 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.వనమా రాఘవేందర్ ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై కొందరు పోలీసులకు సమాచారం లభించిందనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతుంది. హైద్రాబాద్ లో అరెస్టైనట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఈప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అయితే మరునాడే రాఘవేందర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అరెస్టయ్యాడు. 

రాఘవ సిమ్ కార్డులు మార్చడం వల్ల ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని గుర్తించడం కష్టంగా మారిందని కూడా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. మరో వైపు రాఘవేందర్ రావు అనుచరులకు ఎక్కువగా ఏ పోన్ల నుండి ఫోన్లు వచ్చాయనే విషయమై పోలీసులు డేటాను సేకరించారు.ఈ data ఆధారంగా పోలీస్ శాఖ విచారణను ప్రారంభించింది. ఈ విచారణలో రాఘవేందర్ రావు కు సహకరించిందెవరనే విషయమై తేలనుంది.
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్