అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్: బెయిల్ తిరస్కరించిన కోర్టు

By narsimha lode  |  First Published Jun 8, 2023, 4:14 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లై  బెయిల్ పిటిషన్ ను  ఢిల్లీ స్పెషల్ కోర్టు  ఇవాళ  కొట్టివేసింది. 


న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లై బెయిల్ పిటిషన్ ను  ఢిల్లీ కోర్టు  గురువారంనాడు కొట్టివేసింది. ఢిల్లీ  లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈ ఏడాది మార్చి  6వ తేదీన ఈడీ అరెస్ట్  చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ ను  దర్యాప్తు సంస్థలు కోర్టుకు  సమర్పించాయి.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కట్వకుంట్లకు  కవితకు  అరుణ్ రామచంద్రపిళ్లై బినామీ అని   దర్యాప్తు  సంస్థలు  ఆరోపించాయి.  ఢిల్లీ లిక్కర్ స్కాంపై  కోర్టులో దాఖలు  చేసిన చార్జీషీట్లలో  కూడ  ఈ విషయాన్ని  దర్యాప్తు సంస్థలు  ప్రస్తావించాయి.  

అయితే  తొలుత తాను  ఇచ్చిన వాంగ్మూలాన్ని  అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకున్నారు.   ఈ విషయమై  కోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.   బెయిల్ పిటిషన్ పై వాదనల సమయంలో  ఈ విషయాన్ని అరుణ్ రామచంద్ర పిళ్లై తరపు న్యాయవాది ప్రస్తావించారు.  స్టేట్ మెంట్ వెనక్కు తీసుకున్నందుకు గాను  బెయిల్ ఇవ్వకుండా  నిరాకరించవద్దని  కూడ  కోరాడు. ఈ నెల  రెండో తేదీన ఇరువర్గాల వాదనలు విన్నది కోర్టు . ఇవాళ తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలిపింది.   ఇవాళ  సాయంత్రం  అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్ పై  కోర్టు తీర్పును వెల్లడించింది.  బెయిల్ పిటిషన్ ను  కొట్టివేసింది.

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కాంలో శ:రత్ చంద్రారెడ్డికి  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది.  శరత్ చంద్రారెడ్డి  ఈ కేసులో అఫ్రూవర్ గా  మారుతానని  కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఇదే కేసులో అరెస్టైన  వైసీపీ ఎంపీ  మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు  మాగుంట రాఘవకు  కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. మాగుంట  రాఘవకు  బెయిల్ మంజూరు చేయడాన్ని  ఈడీ  ఇవాళ  సుప్రీంకోర్టులో  సవాల్  చేసింది. 

also read:అరెస్ట్ భయంతోనే కవితపేరు: అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పై కోర్టులో లాయర్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  సీబీఐ, ఈడీ అధికారులు  సోదాలు  నిర్వహించారు.  ఈ రెండు  రాష్ట్రాలకు  చెందిన పలువురిని  సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం  రేపింది.ఈ కేసులో  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియాను సీబీఐ  ఈ ఏడాది  ఫిబ్రవరి  26న  అరెస్ట్  చేసింది.  ఈ కేసులో  మనీష్ సిసోడియా  తీహార్ జైలులోనే  ఉన్నాడు.  బెయిల్ కోసం  మనీష్ సోసిడియా  దాఖలు  చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు  ఇటీవలనే తిరస్కరించింది

click me!