
బైక్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు దంపతులు మృతి చెందారు. స్థానికులు వారిని గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారు చనిపోయారని డాక్టర్లు నిర్దారించారు. ఈ ఘటన సంగారెడ్డి (sangareddy) జిల్లా నారాయణఖేడ్ (narayanakhed) మండల పరిధిలో జరిగింది.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (kamareddy) జిల్లా నాగిరెడ్డిపేట (nagireddy) మండలం జలాల్ పూర్ (jalalpur)కు చెందిన బేగరి లక్ష్మయ్య (bhegari lakshmaiah) (60), చిత్రమ్మ (chitramma) (57) ఇద్దరు భార్యాభర్తలు. అయితే వారు శనివారం బైక్ పై మనూరు (manuru) మండలం తిమ్మాపూర్ (timmapur)లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. దీని కోసం బైక్ పై ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. సంగారెడ్డి - నాందేడ్ నేషనల్ హైవే (national highway)పై జర్నీ మొదలు పెట్టారు. అయితే వారు తమ గమ్యానికి బదులుగా అనుకోకుండా నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలోని బ్రిడ్జిపైకి బైక్ ను వెళ్లనిచ్చారు. కొంత సమయం తరువాత తాము దారి తప్పామని గమనించుకున్నారు. దీంతో లక్ష్మయ్య బైక్ ను యూటర్న్ తిప్పాలని అనుకున్నాడు. ఇలా యూటర్న్ తిప్పుతున్న సమయంలో అటు నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి బైక్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భార్య చిత్రమ్మ ఘటనా స్థలంలోనే చనిపోయారు. లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు గమనించారు. వెంటనే హైవే అంబులెన్స్ లో ఖేడ్ ఏరియా హాస్పిటల్ (khed Area Hospital) కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్ కు తీసుకొచ్చే ముందే ఆయన చనిపోయారు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 9వ తేదీన మంచిర్యాల జిల్లాలో (Mancherial district)ని జన్నారం మండలం (Jannaram mandal) ఇందన్‌పల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతులు మృతి చెందారు. మాజీ ఎంపీటీసీ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఇందన్ పల్లి ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడే చనిపోయారు. మృతులను శోభన దేవి, ఆమె భర్త మురళిధర్ రెడ్డిగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.