ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. బస్సు ఢీకొని దంపతులు మృతి

Published : Oct 31, 2019, 10:56 AM ISTUpdated : Oct 31, 2019, 11:37 AM IST
ఔటర్ రింగ్ రోడ్డులో  ప్రమాదం.. బస్సు ఢీకొని దంపతులు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్ద అంబర్‌పేట్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు పెద్ద అంబర్ పేట్ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు పశ్చిమగోదావరి జిల్లా తుని డిపోకి చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?