మరో తెరాస ఎమ్మెల్యేకి కరోనా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

By Sreeharsha GopaganiFirst Published Jul 23, 2020, 7:08 AM IST
Highlights

బ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ వైరస్ బారినపడి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. 

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరినీ వణికించేస్తోంది. ఈ వైరస్ బారిన ఇప్పటికే అనేక మంది ప్రముఖులు పడ్డారు. కొందరు ప్రాణాలను కూడా వదిలారు. 

మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మహమ్మారి విజృంభణ నానాటికి పెరిగిపోతుంది. తెలంగాణాలో నిన్న మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ వైరస్ బారినపడి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. 

ఆయన కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ఆయనను ఫిలిం నగర్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. 

ఇప్పటికే తెలంగాణాలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, పద్మారావు గౌడ్, మహమూద్ లో సహా మరికొందరు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది.

నిన్న కరోనా కారణంగా తొమ్మిది మరణించడంతో మృతుల సంఖ్య 438కి చేరుకుంది. బుధవారం 1,281 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటి వరకు 37,666 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 842 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, కరీంనగర్ 73, నల్గొండ 51, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిజామాబాద్ 28, మెదక్ 25, పెద్దపల్లి 23, సూర్యాపేట, కామారెడ్డిలో 22, సిరిసిల్ల 18, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ 14, మహబూబాబాద్ 11, యాదాద్రి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎనిమిది చొప్పున కేసులు నమోదయ్యాయి. 

click me!