రంగారెడ్డిలో మళ్లీ కరోనా విజృంభణ: తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు

Published : Aug 21, 2020, 08:29 AM IST
రంగారెడ్డిలో మళ్లీ కరోనా విజృంభణ: తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. హైదరాబాదులో 400కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99391కి చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో మరోసారి కరోనా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ జిల్లాలో 202 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో కోరనా వైరస్ తో 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 737కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కు చికిత్స పొంది 76,967 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 21,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

ఆదిలాబాద్ 16
భద్రాద్రి కొత్తగూడెం 21
జిహెచ్ఎంసీ 473
జగిత్యాల 81
జనగామ 22
జయశంకర్ భూపాలపల్లి 12
జోగులాంబ గద్వాల 55
కామారెడ్డి 55
కరీంనగర్ 86
ఖమ్మం 79
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 15
మహబూబ్ నగర్ 29
మహబూబాబాద్ 26
మంచిర్యాల 40
మెదక్ 24
మేడ్చెల్ మల్కాజిగిరి 170
ములుగు 11
నాగర్ కర్నూలు 27
నల్లగొండ 60
నారాయణపేట 14
నిర్మల్ 19
నిజామాబాద్ 69
పెద్దపల్లి 35
రాజన్న సిరిసిల్ల 29
రంగారెడ్డి 202
సంగారెడ్డి 38
సూర్యాపేట 28
వికారాబాద్ 16
వనపర్తి 21
వరంగల్ రూరల్ 26
వరంగల్ అర్బన్ 101
యాదాద్రి భువనగిరి 18
మొత్తం కేసులు 1967

 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu