తెలంగాణలో కరోనా ఉధృతి: 2 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

Published : Oct 03, 2020, 09:59 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: 2 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా వచ్చింది. హైదరాబాదులో 200కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 97 వేల327కు చేరుకుంది. 

శుక్రవారం రాత్రి 8 గంటల వరకు తెలంగాలో49,084 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాదులో నిన్న ఒక్క రోజులో 285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజులో కరోనా వ్యాధితో 8 మంది మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 1153కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధి నుంచి నిన్న ఒక్క రోజులో 2002 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనిా నుంచి లక్షా 67 వేల 846 మంది కోలుకున్నారు ఇంకా 28,328 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 31 వేల 4 వేల 542కు చేరుకుంది.

గత 24 గంటల్లో తెలంగాణలో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

ఆదిలాబాద్ 15
భద్రాద్రి కొత్తగూడెం 55
జిహెచ్ఎంసీ 285
జగిత్యాల 33
జనగామ 24
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 20
కామారెడ్డి 39
కరీంనగర్ 105
ఖమ్మం 79
కొమురంభీమ్ ఆసిఫాబాద్ 25
మహబూబ్ నగర్ 32
మహబూబాబాద్ 52
మంచిర్యాల 20
మెదక్ 19
మేడ్చెల్ మల్కాజిగిరి 115
ములుగు 20
నాగర్ కర్నూలు 23
నల్లగొండ 103
నారాయణపేట 12
నిర్మల్ 18
నిజామాబాద్ 58
పెద్దపల్లి 22
రాజన్న సిరిసిల్ల 52
రంగారెడ్డి 128
సంగారెడ్డి 42
సిద్ధిపేట 76
సూర్యాపేట 60
వికారాబాద్ 24
వనపర్తి 28
వరంగల్ రూరల్ 21
వరంగల్ అర్బన్ 56
యాదాద్రి భువనగిరి 37

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?