తెలంగాణలో వేయి దాటిన కరోనా మరణాలు: లక్షా 65 వేలు దాటి కేసులు

Published : Sep 17, 2020, 09:54 AM ISTUpdated : Sep 17, 2020, 09:59 AM IST
తెలంగాణలో వేయి దాటిన కరోనా మరణాలు: లక్షా 65 వేలు దాటి కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ మరణాల సంఖ్య వేయి దాటింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటింది. హైదరాబాదులో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా జిల్లాల్లో పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగామలో 2159 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య తెలంగాణలో లక్షా 65 వేల 3కు చేరుకుంది.

తెలంగాణ కరోనా వైరస్ మరణాల సంఖ్య వేయి దాటింది. తాజాగా తెలంగాణలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 9 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1005క చేరుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ బారి నుంచి లక్షా 33 వేల 555 మంది కోలుకున్నారు. ఇంకా 30443 మంది కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. 

హైదరాబాదులో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల్లో పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో యధావిధిగా కేసుల సంఖ్య నమోదవుతూ వస్తోంది. 

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 20
భద్రాద్రి కొత్తగూడెం 60
జిహెచ్ఎంసీ 318
జగిత్యాల 45
జనగామ 35
జయశంకర్ భూపాలపల్లి 22
జోగులాంబ గద్వాల 18
కామారెడ్డి 49
కరీంనగర్ 127
ఖమ్మం 77
కొమరభీమ్ ఆసిఫాబాద్ 13
మహబూబ్ నగర్ 24
మహబూబాబాద్ 84
మంచిర్యాల 33
మేదక్ 34
మేడ్చెల్ మల్కాజిగిరి 121
ములుగు 18
నాగర్ కర్నూలు 27
నల్లగొండ 141
నారాయణపేట 14
నిర్మల్ 29
నిజామాబాద్ 84
పెద్దపల్లి 47
రాజన్న సిరిసిల్ల 53
రంగారెడ్డి 176
సంగారెడ్డి 64
సిద్ధిపేట 132
సూర్యాపేట 66
వికారాబాద్ 22
వనపర్తి 23
వరంగల్ రూరల్ 39
వరంగల్ అర్బన్ 98
యాదాద్రి భువనగిరి 46

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?