తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 69 వేలకు చేరువైంది. హైదరాబాదులో కోవిడ్ -19 విజృంభణ ఆగడం లేదు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1286 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 68,946కు చేరుకుంది. గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 12 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 563కు చేరుకుంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 391 మందికి కరోనా వైరస్ సోకింది. కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరంగల్ అర్బన్ లో కాస్తా తగ్గుముఖం పట్టింది.
గత 24 గంటల్లో ఆదిలాబాదులో 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 38, జగిత్యాల జిల్లాలో 22, జనగామ జిల్లాలో 8, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, జోగులాంబ గద్వాల జిల్లాలో 55, కామారెడ్డ్ి జిల్లాలో 6, కరీంనగర్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి.
ఖమ్మం జిల్లాలో 41, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3, మహబూబ్ నగర్ జిల్లాల్లో 39, మహబూబాబాద్ జిల్లాలో 27, మంచిర్యాల జిల్లాలో 21, మెదక్ జిల్లాలో 7, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 72, ములుగు జిల్లాలో 5, నాగర్ కర్నూలు జిల్లాలో 29, నల్లగొండలో 29 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో నాలుగేసి కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో 59, పెద్దపల్లి జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. రంగారెడ్డి జిల్లాలో 121, సంగారెడ్డి జిల్లాలో 15, సిద్ధిపేట జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 23, వికారాబాద్ జిల్లాలో 17, వనపర్తి జిల్లాలో 14, వరంగల్ రూరల్ జిల్లాలో 11, వరంగల్ అర్బన్ జిల్లాలో 63, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 04.08.2020) pic.twitter.com/R3LOCucfaq
— Dr G Srinivasa Rao (@drgsrao)