తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 40 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 06, 2020, 09:34 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 40 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షా 40 వేలుదాటాయి. గత 24 గంటల్లో కరోనాతో 9 మంది మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 2574 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో లక్షా 40 వేల 969కి చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య రాష్ట్రంలో 886కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2927 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 7 వేల 530కి చేరుకుంది. ఇంకా 32553 యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి..

ఆదిలాబాద్ 22
భద్రాద్రి కొత్తగూడెం 69
జిహెచ్ఎంసీ 325
జగిత్యాల 81
జనగామ 39
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 21
కామారెడ్డి 86
కరీంనగర్ 144
ఖమ్మం 128
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 25
మహబూబ్ నగర్ 44
మహబూబాబాద్ 73
మంచిర్యాల 63
మెదక్ 34
మేడ్చెల్ మల్కాజిగిరి 185
ములుగు 15
నాగర్ కర్నూలు 51
నల్లగొండ 158
నారాయణపేట 11
నిర్మల్ 19
నిజామాబాద్ 95
పెద్దపల్లి 69
రాజన్న సిరిసిల్ల 45
రంగారెడ్డి 197
సంగారెడ్డి 82
సిద్ధిపేట 88
సూర్యాపేట 102
వికారాబాద్ 14
వనపర్తి 41
వరంగల్ రూరల్ 40
వరంగల్ అర్బన్ 117
యాదాద్రి భువనగిరి 67
మొత్తం కేసులు 2574

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu
Revanth Reddy emotional: కొడంగల్‌లో ఓడిపోయా.. నాపని అయిపోయిందని.. | Asianet News Telugu