పుట్టిన బిడ్డతో ఆనందంగా సొంత గ్రామానికి వస్తే కనీసం ఊర్లోకి కూడా రానివ్వలేదు. దీంతో ఆ బిడ్డతో ఆమె ఊరి పొలిమేరల్లో చెట్టు నీడన బతుకీడుస్తోంది.
కరోనా వైరస్ భయం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. ఎవరినీ ఊర్లోకి రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే.. గ్రామస్థుల్లోని కరోనా భయం ఓ బాలింత నరకం అనుభవిస్తోంది. పుట్టిన బిడ్డతో ఆనందంగా సొంత గ్రామానికి వస్తే కనీసం ఊర్లోకి కూడా రానివ్వలేదు. దీంతో ఆ బిడ్డతో ఆమె ఊరి పొలిమేరల్లో చెట్టు నీడన బతుకీడుస్తోంది.
ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బొప్పరికుంట పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బొప్పరికుంట పంచాయతీ పరిధిలోని రాజులగూడకు చెందిన కుడిమెత జైతు, అనసూయ దంపతులు కరీంనగర్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. అనసూయ కరీంనగర్ లో ఈ నెల 14న బిడ్డకు జన్మనిచ్చింది.
undefined
బిడ్డతో సహా ఆనందంగా వారు ఈ నెల 15వ తేదీన సొంత గ్రామానికి చేరుకోగా.. స్థానికులు వారిని గ్రామంలోనికి రానివ్వలేదు. అప్పటి నుంచి ఊరి పొలిమేరలో ఓ చెట్టు కింద గుడారం వేసుకొని ఉంటున్నారు.
విషయం తెలుసుకున్న హస్నాపూర్ వైద్య సిబ్బంది బుధవారం అక్కడకు చేరుకొని బాలితంతో పాటు శిశువుకు వైద్య పరీక్షలు చేయించారు. స్థానికులను ఒప్పించి వారిని గ్రామంలోని అనుతించేలా చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో వారు ఇంటికి చేరుకున్నారు. కాగా ఆ దంపతులకు వైద్య సిబ్బంది క్వారంటైన్ ముద్ర వేశారు.