తెలంగాణలో కరోనా: 57 వేలు దాటిన కేసులు, అట్టుడుకుతున్న హైదరాబాద్

Published : Jul 28, 2020, 07:51 AM ISTUpdated : Jul 28, 2020, 08:19 AM IST
తెలంగాణలో కరోనా: 57 వేలు దాటిన కేసులు, అట్టుడుకుతున్న హైదరాబాద్

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. హైదరాబాదులో ఎప్పటిలాగే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా హైదరాబాదు కరోనా పాజిటివ్ కేసులతో అట్టుడుకుతోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 1610 మందికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాదులో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణలో 57,142 కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో కోవిడ్ 19తో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 480కి చేరుకుంది. వరంగల్ అర్బన్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 152 పాడిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదుకు దరిదాపుల్లో ఉండే రంగారెడ్డి జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 113 కేసులు నమోదయ్యాయి. 

ఆదిలాబాద్ జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 12, జనగామ జిల్లాలో 18, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20, జోగులాబం గద్వాల జిల్లాలో 34, కామారెడ్డి జిల్లాలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 23, మహబూబాబాద్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 12, ములుగు జిల్లాలో 32, నాగర్ కర్నూల్ జిల్లాలో 9, నల్లగొండ జిల్లాలో 26, నారాయణ పేట జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. 

నిజామాబాద్ జిల్లాలో 58, పెద్దపల్లి జిల్లాలో 48, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14, సంగారెడ్డి జిల్లాలో 74, సిద్దిపేట జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 35, వికారాబాద్ జిల్లాలో 11, వనపర్తి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 25, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల వివరాలను కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ లో విడుదల చేసింది. ఏ విధమైన పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని పడకలపై రోగులున్నారు, ఖాళీ పడకల సంఖ్య ఎంత వంటి వివరాలను కూడా బులిటెన్ లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu