హైదరాబాదులో స్వల్ప పెరుగుదల: తెలంగాణలో 2381 కరోనా కేసులు

Published : Sep 25, 2020, 09:14 AM ISTUpdated : Sep 25, 2020, 09:15 AM IST
హైదరాబాదులో స్వల్ప పెరుగుదల: తెలంగాణలో 2381 కరోనా కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటిలాగానే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 2 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్జయ్యాయి. హైదరాబాదులో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ 2 వేలకు తక్కువగా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 2381 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 81 వేల 627కు చేరుకుంది.

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా కరోనా వైరస్ వ్యాధి కారణంగా పది మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1080కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2021 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 50 వేల 160కి చేరుకుంది. ఇంకా 30,387 మంది కరోనా వ్యాధికి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాదులో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 386 కరోనా పాజిటివ్ కేులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో తాజాగా గత 24 గంటల్లో 132 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

ఆదిలాబాద్ 15
భద్రాద్రి కొత్తగూడెం 97
జిహెచ్ఎంసీ 386
జగిత్యాల 51
జనగామ 23
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 25
కామారెడ్డి 58
కరీంనగర్ 119
ఖమ్మం 84
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 13
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 68
మంచిర్యాల 29
మెదక్ 39
మేడ్చెల్ మల్కాజిగిరి 193
ములుగు 15
నాగర్ కర్నూలు 67
నల్లగొండ 132
నారాయణపేట 12
నిర్మల్ 43
నిజామాబాద్ 69
పెద్దపల్లి 31
రాజన్న సిరిసిల్ల 70
రంగారెడ్డి 227
సంగారెడ్డి 50
సిద్ధిపేట 86
సూర్యాపేట 78
వికారాబాద్ 23
వనపర్తి 58
వరంగల్ రూరల్ 24
వరగల్ అర్బన్ 83
యాదాద్రి భువనగిరి 52

 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu