తెలంగాణలో కరోనా కోరలు: లక్షా 30 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 02, 2020, 08:50 AM IST
తెలంగాణలో కరోనా కోరలు: లక్షా 30 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 30 వేల మార్కును దాటింది. హైదరాబాదులో మరోసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో నిన్నటి కన్నా ఈ రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 400కు పైగా కేసులు నమోదైతే రంగారెడ్డి జిల్లాలో 200కు పైగా కేసులు రికార్డయ్యాయి. 

గత 24 గంటల్లో తెలంగాణలో 2892 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 30 వేల 589కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 846కు చేరుకుంది. 

గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2240 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో తెలంగాణ మొత్తంలో కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 97,402కు చేరుకుంది. ఇంకా 32341 యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 38
భద్రాద్రి కొత్తగూడెం 81
జిహెచ్ఎంసి 477
జగిత్యాల 102
జనగామ 43
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 28
కామారెడ్డి 64
కరీంనగర్ 152
ఖమ్మం 128
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 13
మహబూబ్ నగర్ 53
మహబూబాబాద్ 61
మంచిర్యాల 83
మెదక్ 32
మేడ్చెల్ మల్కాజిగిరి 192
ములుగు 27
నాగర్ కర్నూలు 45
నల్లగొండ 174
నారాయణపేట 12
నిర్మల్ 31 
నిజామాబాద్ 110
పెద్దపల్లి 85
రాజన్న సిరిసిల్ల 39
రంగారెడ్డి 234
సంగారెడ్డి 71
సిద్ధిపేట 108
సూర్యాపేట 108
వికారాబాద్ 15
వనపర్తి 51
వరంగల్ రూరల్ 38
వరంగల్ అర్బన్ 116
యాదాద్రి భువనగిరి 60
మొత్తం కేసులు 2892

 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu