తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 27 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 01, 2020, 09:36 AM ISTUpdated : Sep 01, 2020, 09:37 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: లక్షా 27 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి యథావిధిగా జరుగుతోంది. హైదరాబాదులో మాత్రం కాస్తా తగ్గముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు అర్థమువతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. హైదరాబాదులో మాత్రం కాస్తా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2734 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 27 వేల 697కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 836కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2325 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినవారి సంఖ్య 95136కు చేరుకుంది. ఇంకా 31699 మంది కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు.  

తెలంగాణలో గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు ఇవీ...

ఆదిలాబాద్ 27
భద్రాద్రి కొత్తగూడెం 117
జిహెచ్ఎంసీ 347
జగిత్యాల 91
జనగామ 47
జయశంకర్ భూపాలపల్లి 15
జోగులాంబ గద్వాల 42
కామారెడ్డి 72
కరీంనగర్ 106
ఖమ్మం 161
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 66
మహబూబాబాద్ 81
మంచిర్యాల 96
మెదక్ 43
మేడ్చెల్ మల్కాజిగిరి 121
ములుగు 24
నాగర్ కర్నూలు 48
నల్లగొండ 191
నారాయణపేట 18
నిర్మల్ 39
నిజామాబాద్ 114
పెద్దపల్లి 74
రాజన్న సిరిసిల్ల 49
రంగారెడ్డి 212
సంగారెడ్డి 16
సిద్ధిపేట 109
సూర్యాపేట 107
వికారాబాద్ 12
వనపర్తి 55
వరంగల్ రూరల్ 30
వరంగల్ అర్బన్ 112
యాదాద్రి భువనగిరి 76
మొత్తం కేసులు 2734

 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu