కరోనా ఎఫెక్ట్... తెలంగాణలో ఏర్పాటుచేసే చెక్ పోస్టులివే...: సీఎం కేసీఆర్

By Arun Kumar PFirst Published Mar 19, 2020, 9:23 PM IST
Highlights

తెెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత ప్రజల్లోనూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే విదేశాల నుండి వచ్చేవారిని సరయిన పద్దతుల్లో కట్టడి చేయలేకపోవడం వల్ల దేశంలోకి ప్రవేశించిన ఈ వైరస్ విజృంభించడానికి సిద్దమయ్యింది. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ఈ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం వుంది కాబట్టి ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన ప్రాంతాల్లో ప్రత్యే చెక్ పోస్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్దమయ్యింది. 

ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. తెలంగాణతో సరిహద్దు కలిగిన  కర్ణాటక, మహారాష్ట్రలలో ఈ వైరస్ ప్రభావం అధికంగా వుంది. కాబట్టి అక్కడి నుండి వైరస్ సోకినవారు తెలంగాణలోకి ప్రవేశించి వ్యాప్తి చెందించకుండా సరిహద్దుల్లోనే నిలువరించే ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అందులోభాగంగా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

read morre  కఠినంగానే ఉంటాం, ఆంక్షలు తప్పవు: ప్రజలు సహకరించాలన్న కేసీఆర్

ఈ చెక్ పోస్టుల ద్వారా రాష్ట్రాల మధ్య వ్యాధివ్యాప్తిని నిరోధించవచ్చిన ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ఇప్పటికే ఎక్కడెక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నది కూడా ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కరోనావ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 
 

click me!