కరోనా వైరస్: తెలంగాణలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్..!!

Siva Kodati |  
Published : Dec 16, 2020, 08:25 PM IST
కరోనా వైరస్: తెలంగాణలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్..!!

సారాంశం

తెలంగాణలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం పది వేల మంది సిబ్బందిని చేశారు

తెలంగాణలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం పది వేల మంది సిబ్బందిని చేశారు.

3 కోట్ల డోసులు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు సైతం అందుబాటులో వుంచేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అలాంటివారినే వ్యాక్సిన్ కేంద్రాలకు అనుమతించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్పాట్ రిజిస్ట్రేషన్‌ లాంటి వాటికి అవకాశం లేదని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది