తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 5,695 పాజిటివ్ !

By AN TeluguFirst Published May 3, 2021, 10:46 AM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 58,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 5,695కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 56 వేల 485 చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
 
రాష్ట్రంలో నిన్న కరోనాతో 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,417కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో80,135 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిహెచ్ఎంసి పరిధిలో మరో 1352 కేసులు నమోదయ్యాయి.

కాగా దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో 3.68 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15 లక్షల 4 వేల ఆరు వందల 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,68,147 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో  వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం ఊరటనిస్తుంది .గడచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కోవిడ్ ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుంచి కోల్పోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!