కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: బ్లేడుతో కడుపు కోసేసుకున్నాడు...

Published : Mar 29, 2020, 07:03 PM ISTUpdated : Mar 29, 2020, 07:39 PM IST
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: బ్లేడుతో కడుపు కోసేసుకున్నాడు...

సారాంశం

తాజాగా మందు దొరక్క ఒక వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోధన్ నివాసముంటున్న సయ్యద్ ఎజాజ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్కపోతుండడంతో అతడు పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. 

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా లాక్ డౌన్ ప్రకటించడంతో దేశంలోని నిత్యావసరాల దుకాణాలు తప్ప మిగిలిన దుకాణాలన్నీ మూతపడ్డాయి. 

అన్ని దుకాణాల సంగతి దేవుడెరుగు, కానీ మద్యం దుకాణాలు మూసివేయడంతో మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. ముందుకు తీవ్రంగా బానిసలైన వారు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా మందు దొరక్క ఒక వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోధన్ నివాసముంటున్న సయ్యద్ ఎజాజ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్కపోతుండడంతో అతడు పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. 

మద్యం దొరకక పిచ్చి పట్టినట్టు అరుస్తూ బ్లేడ్ తో తన కడుపును కోసుకున్నాడు. ఒక్కసారిగా ఈ ఘటనతో అవాక్కయిన కుటుంబసభ్యులు, బస్తి వాసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. 

తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు అక్కడ  వైద్యులు అతడికి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలియవస్తుంది. 

also read:మాంఛెస్టర్‌లో చిక్కుకొన్న వరంగల్ వాసులు: కాపాడాలని కేటీఆర్‌కు వీడియో ట్వీట్

మందుబాబులు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఊళ్లలో అయితే నాటుసారా గుడుంబా, కల్లు ఏదైనా సరే కిక్కే లక్ష్యం అన్నట్టుగా తాగేస్తున్నారు. హైద్రాబాద్ లో మందు దొరక్క ఒక మందుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకంగా మందుబాబులు మందు షాపులకు కన్నాలు వేయడానికి కూడా వెనకాడడం లేదు. 

ఇటువంటి సంఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి కూడా. ఇక ఊర్లలోనయితే ఉదయం నుండే కల్లు కోసం క్యూలు కడుతున్నారు. ఈత కల్లు తాటి కల్లు అని తేడా లేకుండా ఏదైనా సరే నషా ఎక్కితే చాలన్నట్టుగా మీదపడి తాగేస్తున్నారు. సాధారణంగా 20 రూపాయలుండే సీసా ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంటుంది. 

ఇకపోతే తెలంగాణలో మద్యం షాపులను రేపటి నుండి మద్యాహ్నం పాటు ఒక రెండున్నర గంటల పాటు తెరిచి ఉంచుతామని చెప్పే ఒక ఫేక్ సర్కులర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఈ ఫేక్ న్యూస్ ను కూడా మందు బాబులు తెగ షేర్ చేస్తున్నారు. అందులో గ్రామర్ ను బట్టి చూస్తే ఇదేదో ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ మందుబాబుల మద్యం లవ్ వారిని కనీసం ఆ పోస్టును పూర్తిగా కూడా చదవనివ్వడంలేదు. చదువొచ్చినవారు, చదువు రానివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మందు లవర్ దాన్ని ఫార్వర్డ్ చేసాడు. 

సోషల్ మీడియా గ్రూపుల్లో నెలరోజులపాటు మందు కొనుక్కొని పెట్టుకోవాలని తెగ చర్చలు కూడా పెడుతున్నారు. ఇలా మందుబాబులకు ఒక్కసారిగా ఇది ఫేక్ న్యూస్ అని తెలియగానే తెగ బాధపడిపోతున్నారు. 

ఇకపోతే ఊళ్లలో కల్తీ మందు కూడా ఏరులై పారుతుంది. నాటుసారా, గుడుంబా అనే తేడా లేకుండా దానికోసం జనం ఎగబడుతున్నారు. ఫారిన్ మందులు మాత్రమే తాగే మందుబాబులు కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్