తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు

Published : Dec 10, 2020, 09:55 AM IST
తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు

సారాంశం

బుధవారం ఒక్కరోజే కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దీంతో.. తెలంగాణలో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,482కి చేరింది.


తెలంగాణ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

కాగా.. బుధవారం ఒక్కరోజే కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దీంతో.. తెలంగాణలో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,482కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 805 మంది కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,66,925కి చేరింది. 

రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?