జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విస్తృతి: కేంద్ర వైద్య ఆరోగ్య బృందం పర్యటన

By narsimha lodeFirst Published Jun 29, 2020, 10:13 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను కేంద్ర బృందం సోమవారం నాడు పరిశీలించనుంది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను కేంద్ర బృందం సోమవారం నాడు పరిశీలించనుంది.

ఆదివారం నాడు సాయంత్రం కేంద్ర బృందం హైద్రాబాద్ కు చేరుకొంది. సోమవారం నాడు ఉదయం  గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. 

ఆ తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని దోమలగూడలోని కంటైన్మెంట్  జోన్ లో  కేంద్ర బృందం  పర్యటించనుంది.  దోబీ గల్లీలో పరిస్థితులను పరిశీలించనుంది.  అక్కడి నుండి నేరుగా హిమాయత్ నగర్ లోని వినయ్ బాబు ఇంటికి వెళ్లనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్ లో కేంద్ర బృందం భోజనం చేయనుంది.

ఇదే భవనంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని బృందం  రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర బృందానికి వివరించనుంది. రాష్ట్రంలో తీసుకొంటున్న చర్యలపై కూడ ఈ బృందం సమీక్ష నిర్వహించనుంది. జీహెచ్ఎంసీలో తీసుకొంటున్న చర్యలపై కమిషనర్ లోకేష్ కుమార్ కేంద్ర బృందానికి వివరించనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో  కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడానికి గల కారణాలపై కూడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ ఈ సమావేశంలో చర్చిస్తారు.

click me!