108,104లో రోగులు వెళ్లడం లేదు, డబ్బు, మద్యం బాటిల్లు వెళ్తున్నాయ్: వీహెచ్

By Nagaraju TFirst Published Dec 6, 2018, 4:00 PM IST
Highlights

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంపై 50 మంది పోలీసులు దాడులు చెయ్యడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఖండించారు. ఒక రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి దాడులు చెయ్యడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. 
 

హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంపై 50 మంది పోలీసులు దాడులు చెయ్యడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఖండించారు. ఒక రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి దాడులు చెయ్యడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. 

ప్రగతిభవన్ పైనా, కేసీఆర్ నివాసంపైనా దాడులు చెయ్యమంటే చేస్తారా అంటూ నిలదీశారు. అయినా కాంగ్రెస్ అంటే గులాబీ బాస్ కేసీఆర్ కు ఎందుకు అంత భయమంటూ చమత్కరించారు.

ప్రత్యర్థులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. మరోవైపు పోలీసులపైనా వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం టీఆర్ఎస్ కు మద్దతుగా వ్యవహరించాలని చెప్తున్నారంటూ ఆరోపించారు. 

కూకట్ పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మహిళలను కూడా చూడకుండా బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడ్డపేరు తెచ్చుకోవద్దని డీజీపీ మహేందర్ రెడ్డికి చెప్తున్నట్లు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్రంలో డబ్బు పంపిణీకి టీఆర్ఎస్ పార్టీ కొత్త మార్గాన్ని ఎంచుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. రోగులను తీసుకెళ్లాల్సిన 108,104 వాహనాలను డబ్బు తరలించేందుకు, మద్యం సరఫరా చేసేందుకు వాడుకుంటుందని ధ్వజమెత్తారు. 

click me!