మహిళపై వేధింపులు: తెలంగాణ నిఘా విభాగం అధికారి అరెస్టు

By telugu teamFirst Published Jun 1, 2019, 11:46 AM IST
Highlights

బడాన్ పేటకు చెందిన హుస్సేన్ అధికారిక పనుల సందర్భంగా మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారిగా చెబుకున్నాడు. 

హైదరాబాద్: మహిళా మున్సిపల్ కమిషనర్ ను వేధింపులకు గురి చేసిన తెలంగాణ నిఘా విభాగం అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా మున్సిపల్ కమిషనర్ ను దూషించినందుకు గాను 51 ఏళ్ల అన్వర్ హుస్సేన్ ను హైదరాబాదులోని మీర్ పేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

బడాన్ పేటకు చెందిన హుస్సేన్ అధికారిక పనుల సందర్భంగా మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారిగా చెబుకున్నాడు. 

ఆ తర్వాత ఆమె అఫిషియల్ కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్లు చేస్తూ వచ్చాడు. సమయసందర్భాలను విస్మరించి అతను 20 రోజులుగా ఫోన్లు చేస్తున్నాడు. తన మాట వినికపోతే ఎసిబీ దాడులు జరుగుతాయని బెదిరిస్తూ వచ్చాడదు. 

అతని ఫోన్లకు విసిగిపోయిన మహిళ మే 29వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

click me!